23-10-2025 06:36:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నెత్తిపై టోపీ చేతిలో లాటి మీ రక్షణ కోసమేనని పోలీసులంటే భయం విడవాలని జిల్లా ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు పోలీస్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ శాంతి పద్ధతుల పరిరక్షణకు సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తుందని సమాజంలో నేరాలు జరగకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.