23-10-2025 06:13:17 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలో మొగల్తూరు ముద్దుబిడ్డ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం సుల్తానాబాద్ పట్టణంలో ప్రభాస్ వీరాభిమాని చతల శివ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి, సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఒక అభిమాని ఉంటే చాలు అని రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు కోట్లాది ఫ్యాన్స్ సంపాదించుకున్నారని అన్నారు. ఫ్యాన్స్ అందరు గర్వపడేలా సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకొని తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పడుతున్న ప్రభాస్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని.. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమాల్లో పూసల రాకేష్.. నిట్టూరి నిఖిల్.. ఎలిగేడ.ప్రశాంత్.. జానీ.. వేణు.. సందీప్.. శ్రీనివాస్.. రాజు, పలువురు పాల్గొన్నారు.