23-10-2025 06:23:04 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం
హెల్త్ సబ్ సెంటర్, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
తుంగతుర్తి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.20 లక్షల వ్యయం నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ కు, తుంగతుర్తి మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్వహించనున్న సబ్ సెంటర్ కు భూమి పూజ చేశారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రారంభించి నిర్మించిన 20 లక్షల సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసి, పలువురి ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుల పోసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో విద్యా, వైద్య రంగాల బలోపేతం కోసం కృషి చేస్తుందన్నారు. చాలా గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, త్వరలో పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, పంచాయతీరాజ్ డిఇ లింగా నాయక్, ఏఈ మహేష్, టిపిసిసి సభ్యులు గుడిపాటి నరసయ్య,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, మాచర్ల అనిల్, పట్టణ అధ్యక్షుడు, ఉప్పుల రాంబాబు యాదవ్, పెద్ద బోయిన అజయ్, కొండ రాజు,గంగరాజు, వెలుగుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు వాసం వెంకన్న, మాజీ ఎంపిటిసి ఆంగోతు సోమ్ల నాయక్, గ్రామ కార్యదర్శి దుబ్బాక రఘు,దాసరి శ్రీను, కలకోట్ల మల్లేష్, ముత్యాల వెంకటేశ్వర్లు, వీరబోయిన రాములు, సుమన్, రమేష్, జలంధర, హేమ్లా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.