16-12-2024 10:17:50 AM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విజయ్ దివస్ సందర్భంగా అమర సైనికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. త్రివిధ దళాల పరాక్రమం, అంకితభావం మనందరికీ గర్వకారణం అన్నారు. 1971 యుద్ధంలో వీర జవానుల సేవలు స్మరణీయని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ నేడు సభలో రెండు బిల్లులను ఆమోదించనుంది. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లు టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉంది.