calender_icon.png 18 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

16-12-2024 10:49:39 AM

హైదరాబాద్‌: రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌, స్థానిక పోలీసులతో కలిసి మీర్‌పేటలో అంతర్‌రాష్ట్ర డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించి ముగ్గురిని సోమవారం అరెస్టు చేశారు. నిందితులు నుంచి రూ.1.25 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఈ ముఠా మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తోంది. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు డ్రగ్స్‌ తరలిస్తున్న వాహనాలను అడ్డగించి నిందితులను పట్టుకున్నారు.