calender_icon.png 30 August, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో గణపతి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

30-08-2025 02:26:38 PM

ప్రశాంతంగా, సౌకర్యంగా గణేష్ నిమజ్జనం..

నిమర్జనానికి ప్రజలందరూ సహకరించాలి.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.

పెద్దపల్లి, (విజయక్రాంతి): ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనానికి(Ganpati immersion) పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద తగు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, పోలీస్ యంత్రాంగంతో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే  విజయరమణ రావు పరిశీలించారు.  ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణపతి నిమర్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నామని, పెద్దపల్లి ప్రాంత ప్రజలు సకాలంలో ఒక క్రమ పద్ధతి పద్ధతి పాటించి నిమర్జన ప్రక్రియను పూర్తి చేసుకుంటూ అధికారులకు సహకరించాలని కోరారు.

ఎలాంటి అవాంఛ సంఘటనలకు తావివ్వకుండా భక్తి శ్రద్ధలతో నిమర్జనం జరుపుకోవాలని తెలిపారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గణేష్ నిమర్జనం సాఫీగా సాగే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎ.సి.పి గజ్జి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఎ.ఈ సతీష్, సి.ఐ ప్రవీణ్, ఎస్సై లక్ష్మణ్ రావు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.