30-08-2025 02:30:41 PM
కోర్టు ఆర్డర్లను ధిక్కరించిన కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని వేడుకోలు.
తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని(Thungathurthy Mandal Center) వెంపటి రోడ్డులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయానికి ఎదుట సర్వేనెంబర్ 7, 8లో గల సుమారు ఐదున్నర గుంటలు గల భూమిని శేరి లక్ష్మమ్మ జయప్రకాశ్ లు 2012 లో తుంగతుర్తి గ్రామానికి చెందిన బద్ది యాకయ్య వద్ద నుండి కొనుగోలు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ భూమిపై రెవిన్యూ రికార్డుల్లో సంబంధిత బాధితుల పేర్లు వస్తు ఉన్నాయి. అయినప్పటికీ కావాలని కొంతమంది వ్యక్తులు అట్టి భూమిపై కన్నేసి, అక్రమ కబ్జా చేశారని ఆరోపించారు.
అట్టి విషయంపై సదర్ బాధితులు, సూర్యాపేట కోర్టును(Suryapet Court) ఆశ్రయించగా కోర్టులో కేసు పై వాదనలు జరగగా, బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిలో 3 గుంటల భూమి మాత్రమే శేరి లక్ష్మి కుటుంబానికి, ఆమె కుటుంబ సభ్యులకు అనుకూలంగా తీర్పు రావడంతో ,వారు ల్యాండ్ ప్రహరీ గోడకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అట్టి ప్లెక్షి ని చింపివేశారు. అట్టి స్థలంపై మా కుటుంబానికి పూర్తి హక్కు, కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపి, పోలీస్ శాఖ రక్షణతో మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.