30-08-2025 02:29:56 PM
నిరుద్యోగులను ఆదుకోవాలి
ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్
కొత్తపల్లి (విజయక్రాంతి): రేవంత్ సర్కార్ ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఫేల్యూరైందని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్(AIYF State Assistant Secretary Bavandlapalli Yugender) పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా మొదటి నుండి ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు నిరుద్యోగులను మోసం చేసే విధంగా రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో సుమారుగా 45 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై ఎదురుచూస్తున్నారని గత అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపేట్టిన ఉప ముఖ్యమంత్రి ఆయా తేదీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకై తేదీలు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన అక్టోబర్ నెలలో గ్రూప్-1 నోటిఫికేషన్ జనవరిలో డిఎస్సీ ఫిబ్రవరిలో ఎఫ్బివో ఇలా అనేక హమీలు నిరుద్యోగులకు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఏ ఒక్క నోటిఫికేషన్స్ ను ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేదన్నారు. ఆయా డిపార్ట్మెంట్ లలో ఖాళీ అయిన పోస్టులకు నోటిఫికేషన్స్ వేసి రిక్రూట్మెంట్ చేపట్టాలని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించాలని యుగేందర్ డిమాండ్ చేశారు