calender_icon.png 30 August, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

30-08-2025 02:28:36 PM

చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ పట్టణం లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ల్ హాల్ లో ఆర్కే హాస్పిటల్, కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్య కార్యక్రమం లో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 123వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy). అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు వైద్య శిబిరం నిర్వహించినందుకు చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి సామాజిక కార్యక్రమాలు చేయాలి. మా తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చావా ఫౌండేషన్ కి మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్నేహితుడు లాగా ,వ్యక్తిగా సహాయం చేస్తా పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చెయ్యాలని గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది కానీ పదవి ఉండదు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుత్త వెంకటరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.