25-07-2024 12:46:13 PM
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న అభివృద్ధిని ఆపలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు. గతంలో పేపర్ లీకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సూచించారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న ఢిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్: రూ. 2,91,159 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2,20,945 కోట్లు
మూలధన వ్యయం: రూ. 33,487 కోట్లు
పన్ను ఆదాయం: రూ. 1,38,181 కోట్లు
పన్నేతర ఆదాయం: రూ. 35,208 కోట్లు
కేంద్రపన్నుల్లో వాటా: రూ 26,216 కోట్లు
కేంద్రం గ్రాంట్లు: 21,636 కోట్లు
తెలంగాణ బడ్జెట్ లో ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే?
వ్యవసాయం: రూ. 72,659 కోట్లు
ఉద్యానవనం: రూ. 737 కోట్లు
పశుసంవర్థకం: రూ. 1,980 కోట్లు
రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం: రూ. 723 కోట్లు
గృహజ్యోతి పథకం: రూ. 2,418 కోట్లు
ప్రజాపంపిణీ కోసం: రూ. 3,836 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ. 29,816 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ :రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ :రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన: రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన: రూ.500 కోట్లు
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ: రూ. 100 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు: రూ, 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు: రూ. 1,525 కోట్లు
పాతబస్తీలో మెట్రో విస్తరణ: రూ. 500 కోట్లు
మట్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్: రూ.50 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు: రూ. 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు: రూ. 500 కోట్లు
బీసీ సంక్షేమం: రూ. 9,200 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ. 11468 కోట్లు
ట్రాన్స్ కో, డిస్కంలు: రూ. 16,410 కోట్లు
అడవులు, పర్యావరణం: రూ. 1,064 కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ. 17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ. 3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ. 33,124 కోట్లు
ఐటీ రంగం: రూ. 774 కోట్లు
నీటి పారుదల శాఖ: రూ. 22,301 కోట్లు
ఆర్ అండ్ బీ: రూ. 5,790 కోట్లు
పరిశ్రమల శాఖ: రూ. 2,762 కోట్లు
విద్యారంగం: రూ. 21,292 కోట్లు
హోంశాఖ: రూ. 9,564 కోట్లు
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం: రూ. 50.41 కోట్లు