25-07-2024 12:21:20 PM
రాష్ట్ర వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగింది
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
హైదరాబాద్: ఎట్టకేలకు శాసనసభ ముందుకు రాష్ట్ర బడ్జెట్ వచ్చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో ఢిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని భట్టి అన్నారు. తెలంగాణ వచ్చి తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని సూచించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొన్నారు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు, జీతాలు, పింఛన్లు చెల్లింపులకు కటకటలాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్, రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు.