calender_icon.png 15 September, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తి

15-09-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్, సెప్టెంబర్ 14: తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాట యోధులు చూపించిన ధైర్యం,నిబద్దత, త్యాగనిరతి ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్తూపానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైజాం నవాబుల నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశ చరిత్రలోనే గొప్ప పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీను,దేవరం మల్లేశ్వరి,కొప్పోజు సూర్యనారాయణ, కందుల వెంకటేశ్వర్లు, సోమగాని కృష్ణ, దొంతగాని సత్య నారాయణ,యల్లావుల రమేష్, ఇందిరాల వెంకటేశ్వర్లు, జడ వెంకన్న,చెన్నగాని సైదులు, యల్లావుల ఉమా,తదితరులు, పాల్గొన్నారు.