08-07-2025 12:19:28 AM
నీటి హక్కులను ఆంధ్రాకు అమ్ముకున్నారు
రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసినా ప్రాజెక్టులు పూర్తి చేయలే..
పాలమూరు-రంగారెడ్డి సహా కీలక ప్రాజెక్టులపై కెసిఆర్ నిర్లక్ష్యం.
మిషన్ భగీరథపైన సమగ్ర విచారణ జరిపితే కేసిఆర్ జైలుకే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
నాగర్కర్నూల్, జూలై 7 (విజయక్రాంతి) తెలంగాణకు జరిగిన నీటి అన్యాయం వెనుక బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాత్ర ఉన్న దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు డా. వంశీకృష్ణ, కుచకుల్ల రాజేశ్వర్ రెడ్డితో కలిసి మాట్లాడిన మంత్రిమాట్లాడారు.
పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ ఇప్పుడు ప్రజా ఉద్యమాల చేయడం హాస్యాస్పద మన్నారు. తెలంగాణ నీటి వాటాను ఆంధ్ర రాష్ట్రానికి అమ్ముకున్న గను లు కేసీఆరే నని మండిపడ్డారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 68.5% ఉండగా, కేవలం 299 టీఎంసీలే వినియోగించేలా ఒప్పుకున్నది ఎవరు? ఏపీకి 512 టీఎంసీలు వాడుకునే అవకాశం కల్పించినది ఎవరు అని ప్రశ్నించారు.
ఈ నీటి అన్యాయం జరుగుతుంటే, కేసీఆర్, హరీష్ రావు మౌ నంగా ఉండడమే కాకుండా నైతిక హక్కు లేకపోయినా ఇప్పు డు వ్యాఖ్యలు చేయడమే దురదృష్టకరం అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసినా& కృష్ణా బేసి న్ లోని ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఎస్‌ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులు అన్ని అసంపూర్ణంగా మిగిలిపోయాయన్నారు.
కాలువలు, డిస్ట్రిబ్యూషన్ చానెళ్లు, మోటార్ల ఫిట్టింగులు పూర్తి చేయకుండా ప్రజలను మోసం చే శారని మంత్రి ఆరోపించారు. మీరు చేసిన తప్పులను మేమెందుకు భరించాలి? మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయ్యింది. అయినా సరే ప్రతి ప్రాజెక్ట్ను గమనిస్తూ దశలవారీగా పూర్తి చేస్తున్నాం. ప్రజల అవసరాలు మాకు తెలుసు, అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృష్ణా బేసిన్లోని ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని. నీ టి హక్కుల విషయంలో కాంప్రొమైజ్ అనేది ఉండదన్నారు.
మిషన్ భగీరథ పథకం పైన సమగ్ర విచారణ జరిపితే కేసీఆర్ జైలుకు తప్పదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘాటు వ్యా ఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి మిష న్ భగీరథ పథకం పైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.