08-10-2025 01:30:08 AM
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
-జర్మనీ పరిశోధన సంస్థ ఫ్రాన్‌హూఫర్ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధులతో భేటీ
-ఏఐ, ఐవోటీ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చిన్న, సన్నకారు రైతులతో అనుసంధానంపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : డిజిటల్ వ్యవసాయంలో తెలంగా ణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమని, సాగులో నూతన ఆలోచనలతో ముందుకు వచ్చే ఆవిష్కర్తలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.
కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అను సంధానించాలనే అంశంపై మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హూఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధులతో మంత్రి సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, పరుగుమం దుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలను వ్యవసాయానికి అనుంధానించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ టెక్నాటజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు జర్మనీ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందుగానే తెలుసుకో వచ్చన్నారు. ముందస్తు హెచ్చరికల వ్యవస్థల ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించొచ్చని, ఫలితంగా రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుం దని తెలిపారు.
అనంతరం వేములవాడకు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్‌హూఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ఆధ్వర్యంలో అమల వుతున్న యాక్సిలరేటింగ్ క్లుమైట్ అగ్రకల్చర్ ఇన్ తెలంగాణ ప్రాజెక్టు పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చొర వ చూపాలని సంస్థ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం (న్యూఢిల్లీ) ఫుడ్, అగ్రికల్చర్ డివిజన్ హెడ్ వోల్కర్ క్లు మా, ఫ్రాన్‌హూఫర్ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధు లు డా.సెబాస్టియన్ బోస్సే, డా. రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.