calender_icon.png 25 November, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం

25-11-2025 08:02:23 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ లో గురువారం డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 3,465 మహిళా సంఘాలకు మొత్తం రూ.3.60 కోట్లు వడ్డీలేని రుణ రాయితీ చెక్కులను అందజేశామన్నారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు వడ్డీ లేకుండా రుణాలను అందజేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం సంకల్పం తీసుకుందని అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలను మహిళలకు సంఘాలకు అందజేయడం జరుగుతుందన్నారు.