calender_icon.png 25 December, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఓపెన్ విజేతలు హంసిని, రోషన్

25-12-2025 12:57:23 AM

హైదరాబాద్, డిసెంబర్ 24 :యువత చదువుతో పాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని మేడ్చల్ మల్కాజగిరి బ్యా డ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. బాచుపల్లి స్పోర్ట్స్ వన్ ఈ లైట్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హంసిని రోషన్ జోడీ విజేతగా నిలిచింది. ఇలాం టి ఓపెన్ టోర్నీలతో రాష్ట్రంలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీయొచ్చని మాజీ జాతీయ కోచ్ భాస్కర్ బాబు చెప్పారు. ముగింపు వేడుకలకు బ్యాట్ అడ్వైజర్ లక్ష్మణ సభ్యులు జితేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, సీనియర్ కోచ్ వెంకట్, రమేష్ పిల్లలమర్రి తదితరులు హాజరయ్యారు.