25-12-2025 12:58:53 AM
న్యూఢిల్లీ , డిసెంబర్ 24 : ప్రతిష్టాత్మక జాతీయ క్రీడాపురస్కారాలకు సంబంధించి సిఫార్సుల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ప్రకటించింది. ఈ సారి అనూహ్యంగా ఒక్క క్రికె టర్ పేరు కూడా లిస్టులో లేదు. భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్థిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం కోసం సిఫార్సు చేయబడ్డాడు. మరో 24 మంది క్రీడాకారుల పేర్లను ఆయా క్రీడాసంఘాలు అర్జున అవార్డుల కోసం సిఫార్సు చేశాయి.
ఈ జాబితాలో తెలంగాణ నుంచి షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ ప్లేయర్, గాయత్రి గోపీచంద్ ఉన్నారు. టోక్యో వేదికగా జరిగిన డెఫ్లెంపిక్స్‌లో ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు.10 మీ టర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో సైతం మెడల్ గెలిచాడు.23 ఏళ్ల ధనుష్‌కు ఇది నాలుగో డెఫ్లింపిక్స్ స్వర్ణం. గతకొంత కాలంగా షూటింగ్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్న ధనుష్ శ్రీకాంత్ ఒలింపియన్ గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అలాగే బ్యాడ్మింటన్ మహిళల డబు ల్స్‌లో గాయత్రి గోపీచంద్ గత కొంతకాలంగా అద్భుత విజయాలను సాధిస్తోంది.