25-12-2025 12:57:43 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయా ల్లో ఫిరాయింపుల రచ్చ, అనర్హత పిటిషన్ల విచారణ ఉత్కం ఠ రేపుతున్న వేళ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు చట్టపరమైన చిక్కులతో సతమతమవుతుంటే, దానం మాత్రం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, తన రాజకీయ ప్రస్థానంలో తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయమని, అదే తన స్పెషాలిటీ అని వ్యాఖ్యానించా రు.
బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ డివిజన్‌లో నిర్వ హించిన బస్తీ బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా.. ఇతరుల సంగతి నాకు తెలియ దు.. వారు ఏ పార్టీలో ఉన్నారో, వారి స్టాండ్ ఏంటో వారికే తెలియదు. కానీ నేను మాత్రం స్పష్టంగా చెబుతున్నా.. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతాను అని ఆయన తేల్చిచెప్పారు. కో ర్టు కేసులు, స్పీకర్ విచారణల గురించి తాను ఆందోళన చెందడం లేదని, ప్రజాబలం తనకే ఉందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
300 డివిజన్లలో ప్రచారం.. టార్గెట్ జీహెచ్‌ఎంసీ.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా దానం తన ప్రణాళికను బయటపెట్టారు. ‘గ్రేటర్ పరిధిలోని 300 డివిజన్లలో నేను స్వయంగా పర్యటిస్తా. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల సమన్వయంతో మనం అత్యధి క స్థానాల్లో విజయం సాధిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప, విపక్షాల మాటలను నమ్మరు’ అని స్పష్టం చేశారు. వెంకటేశ్వర నగర్ బస్తీలో పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే దానం.. సంబంధిత అధి కారులను పిలిచి, తక్షణమే పనులు చేపట్టాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సహకారంతో ఖైరతాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అని దానం పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.