calender_icon.png 25 December, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూట్రీషన్ రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్

25-12-2025 02:41:30 AM

నిజామాబాద్,డిసెంబర్24 (విజయ క్రాంతి):  జిల్లా కేంద్రానికి సమీపంలో ఖానాపూర్ శివారులో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెన్నెల్ రైస్ ను ఉత్పత్తి చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతీ నెల రేషన్ దుకాణాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ప్రతీ నెల అందిస్తున్న సన్న బియ్యంలో పోషకాల కోసం ఈ పోర్టిఫైడ్ రైస్ ను మిళితం చేసి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు.

ఈ నేపథ్యంలో పోర్టిఫైడ్ రైస్ ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ నిశిత పరిశీలన జరిపారు. దీని తయారీ విధానాన్ని గమనించి, మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నందున తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.