25-12-2025 02:43:31 AM
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ స్విమ్మింగ్ అసోసియే షన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ 2025 ఎంపిక పోటీలను ఈ నెల 8, 9వ తేదీలలో ఆదిలాబాద్‌లో నిర్వహించారు. ఈ పోటీలలో సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ (మంకమ్మతోట, భగత్‌నగర్, విద్యానగర్, సీతా రాంపూర్, చొప్పదండి, కరీంనగర్)కు చెందిన 9వ తరగతి విద్యార్థి కె భువన్ జాతీ య స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడు. భువన్‌ణు పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్‌రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్‌రెడ్డి అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభను కనబర్చాలని ఆకాంక్షించారు.