calender_icon.png 22 October, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 25తో ముగియనున్న సర్వే

21-10-2025 06:44:29 PM

గద్వాల: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన "తెలంగాణ రైజింగ్ - 2047" సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్-2047" సిటిజన్ సర్వేను చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25వ తేదీతో ముగుస్తుంది. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in/telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.