calender_icon.png 22 October, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ కల్పనే ధ్యేయం

22-10-2025 02:09:56 AM

డిసెంబర్ 5న గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్‌ఆర్ సమ్మిట్-25

ముషీరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విద్యార్థులకు నైపుణ్యత, ఉద్యోగాల కల్పనపై చర్చించేందుకు గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్‌ఆర్ సమ్మిట్-2025ను గచ్చిబౌలి లోని నేషనల్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(ఎన్‌ఐటీహెచ్‌ఎం)లో డిసెంబర్ 5-న నిర్వహించనున్నట్లు టీపీఓ అధ్యక్షుడు ప్రొ.జయరాం వెల్లడించారు. ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్‌ఆర్ సమ్మిట్‌కి సంబంధించిన బ్రోచర్‌ను టీపీఓ ప్రతినిధులతో కలసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమ్మిట్ లో 24 రాష్ట్రాల ప్రతినిధులు, హెచ్‌ఆర్‌లు హాజరవుతారని పేర్కొన్నారు.  మొదటి రోజు 5న పరస్పర బృంద చర్చలు, ముగింపు రోజు 6న అవార్డు ప్రధానోత్సవం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొ. దేవిశ్రీ ప్రసాద్, టీపీఓ ఉపాధ్యక్షులు ప్రశాంత్, జనరల్ సెక్రటరీ సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.