21-07-2025 01:50:28 AM
భీమదేవరపల్లి ,జూలై 20 (విజయ క్రాంతి) కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో ఆదివారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చునూరి కర్ణాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి నిరుపేద ప్రజలకు అందిస్తున్నది అన్నారు.
నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు అందించడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చాగంటి వెంకటేశ్వర్లు ,ఎల్కేపల్లి ప్రేమలత ,నల్లగొండ సదానందం, ముడిదొడ్డి సదానందం, శ్రీనివాస్, ఎల్కేపల్లి రాకేష్ ,చిట్టంపల్లి చిరంజీవి ,రాజ వీరు ,చరణ్ తదితరులు పాల్గొన్నారు.