02-09-2025 12:00:00 AM
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రతీకరణ ఖైరతాబాద్ గణపతిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సహచర ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పల్వాయి హరీష్, రామారావు పాటిల్ తో కలిసి వినాయకుని దర్శించుకొని ప్రతేక పూజ హారతి నిర్వహించారు.
తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేష్‌ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోమ వారం మహాగణపతి సందర్శించిన సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ మాట్లా డుతు భారత దేశంలో అత్యంత ఎత్తయిన ఉత్సవ విగ్రహంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ కు లడ్డు కు ఒక ప్రతేక స్థానం ఉందని అన్నారు.
మహాగణపతి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరున్ని వేడుకున్నట్టు తెలిపారు.ఖైరతాబాద్ గణపతి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారా యణ సహచర ఎమ్మెల్యేలను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించరు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.