06-12-2024 01:16:43 AM
బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రజాస్వామ్య హక్కులను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరో పించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి అరెస్టు హేయమైన చర్య, అనుమతి లేకుండా పోలీసులు ఇంటిలోకి చొరబడి, తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కును కోల్పోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు.