calender_icon.png 20 September, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు

20-09-2025 12:00:00 AM

బైంసా సెప్టెంబర్ 19: దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసర సరస్వతి అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 23 నుండి 11 రోజులపాటు నిర్వహించి ఈ ఉత్సవాల్లో సరస్వతి అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు దర్శ నం ఇవ్వనున్నారు.

ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆలయంలో భారీకేడ్లు, తాగునీటి సౌకర్యం, విడిది గదులు సమాచార సేకరణ సిబ్బంది పులిహోర, లడ్డు ప్రసాదం వితరణ వివిధ సేవలను అందించేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని, గోదావరి నదిలో స్నానకట్టల వద్ద భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆలయ ఈవో అంజనదేవి ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తున్నారు