06-11-2025 12:25:34 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ
అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 5, (విజయక్రాంతి):కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల కేంద్రంలో గల శ్రీ భ్రమరాంబ సమెత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మల్లెల నరసింహారావు, పర్స వెంకట్ వారికి సాంప్రదాయ పద్ధతిలో మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారు.
కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో తెల్లవారు జామున నుంచే భక్తులతో ఆల యం వద్దా బారులు తీరారు. కార్తీక మాసం ప్రతి రోజు ఆలయం ఎంతో సందడిగా వుండటం భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగ కుండ ఆలయ కమిటీ ఏర్పాట్లు నిర్వహించి నట్లు ఆలయ చైర్మన్ నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ సబ్ ఇన్స్పెక్టర్ విజయసింహా రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు శివాలయాలలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం నవంబర్ 5 (విజయ క్రాంతి) :కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మండలంలో శివాలయాల నందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం లో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మండల వ్యాప్తంగా శివాలయాలలో తెల్లవారుజామునుండే శివుడికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి నాడు భక్తులు ఉపవాసం చేసి శివుడిని ఆరాధిస్తూ సాయంత్రం వేళలో శివాల యాల మండపాలలో ప్రత్యేక దీపారాధనలు చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపి భక్తులు శివుని దర్శించుకుం టే సర్వ పాపాలు పోయి విముక్తులబి స్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం మొత్తం శివారాధనతో మండలంలో శివాలయాలు భక్తజనులతో కిటకిటలాడు తున్నాయి.
గోదారమ్మకు ఘనంగా నదిహారతి
మణుగూరు, నవంబర్ 5, ( విజయక్రాంతి):మండలంలోని ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ వెలివేరిసింది. శివనామ స్మరణతో ఆలయాలు అన్ని మారుమోగాయి. పురాతన కాలంనాటి శ్రీ నీలకంఠే శ్వర ఆలయంలో ఉదయం నుండి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, మహిళలు పెద్ద ఎత్తు న కార్తీక దీపాలను వెలిగించారు.
కొండాయిగూడెం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సమీపంలోని పవిత్ర గోదావరి నదీ తీరం దీపపు కాంతులతో మురిసిపోయింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్న భక్తులు నది లో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్డున భక్తిశ్రద్ధలతో ప్రమిదల్లో దీపాలు వెలిగిం చారు.
వాటిని గోదావరిలో వదిలి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తుల తో పాటు అయ్యప్ప దీక్షాపరులు పెద్ద ఎత్తున గోదావరి తీరానికి చేరుకోవడంతో పులకించిపోయింది. అర్చకులు ప్రత్యేకంగా భస్మంతో అభిషేకం నిర్వహించి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు కార్తీక పూజల అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వైద్యనాథ లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పవిత్ర గోదావరి నదీ తీరంలో గోదారమ్మకు నదీ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణం లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, గాయత్రీ వేదమాత ఆలయం, శ్రీ దుర్గా మల్లికార్జున ఆలయంలలో మూల విరాట్లను దర్శించు కునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఖమ్మం టౌన్, నవంబర్ 5(విజయ క్రాంతి ): కార్తీక పౌర్ణమి అవడంతో బుధవారం ఖమ్మం లోని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ఖమ్మం లోని శివాలయాల్లో హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఒత్తులు వెలిగించారు. ముఖ్యంగా మహిళా భక్తులు స్వయంగా ఒత్తులను తయారు చేసుకొని కార్తీక పౌర్ణమి రోజు ఇష్ట దేవాలయంలో ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు వేకువ జామున కొందరు దేవాలయాల్లో వత్తులు వెలిగించగా మరికొందరు ఉదయం నుంచి ఉపవాసం వుండి సాయంత్రం దేవాలయాల్లో ఒత్తులు వెలిగించారు.
తమ తమ ఇష్ట దైవాలను తలుచుకుంటూ ఒత్తులను వెలిగించి స్వామి వారులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మంలోని రోటరీ నగర్ లోని పరమేశ్వర రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో, గాంధీ చౌక్ లోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, సమీపంలోని శివాలయంలో, కోయచిలక మార్గంలోని శివాలయంతో పాటు ఖమ్మం లోని అన్నీ శివాలయాలు, పర్ణశాల రామాలయం,
ఖానాపురం స్వయంబు వెంకటేశ్వర స్వామి ఆలయం, మధురానగర్ లోని భువనేశ్వరి అమ్మవారు, కృష్ణ, సాయిబాబా ఆలయం, లాకారం వద్దగల జల ఆంజనేయస్వామి ఆలయంలో, గుట్టమీద గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఖమ్మం లోని ఆలయాలు భక్తులతో కిక్కిరి సాయి. దేవాలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.