25-08-2025 07:24:41 PM
ఎంఈఓ అనితా దేవి..
మరిపెడ (విజయక్రాంతి): మరిపెడ మండల ప్రాధమిక స్థాయి టి యల్ యం మేళా పిఎస్ మరిపెడలో ఎంఈఓ జి. అనితాదేవి(MEO G. Anita Devi) అధ్యక్షతన జరిగింది. వారు మాట్లాడుతూ, మన మండలంలో ఉన్న 50 ప్రాధమిక పాఠశాలల నుండి 63 ప్రదర్శనలు వచ్చాయని, వాటిలో పది టి ఎల్ యం ప్రదర్శనలను రేపు మహబూబాబాద్ లో జరిగే జిల్లా స్థాయి టి ఎల్ యం మేళాకు ఎంపిక చేయడం జరిగిందని, మండల రిసోర్స్ పర్సన్స్ మంగు, లింగన్న, మంగీలాల్, యాదగిరి, విశ్వనాధం, శ్రీను, మహేష్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహారించారని, తెలుగు సబ్జెక్టు నుండి సునీత పిఎస్ గుండెపూడి, రాజేశ్వరి పిఎస్ రాంపూర్, ఆంగ్లం నుండి శ్వేత పిఎస్ డక్నతండా, కవిత యుపిఎస్ ఎడిజర్ల, ప్రవీణ్ పిఎస్ వీరారం, గణితం నుండి సారిక పిఎస్ సీతారాంపురం, వీరన్న యుపిఎస్ తాళ్ల ఊకల్, సరిత పిఎస్ మరిపెడ పరిసరాల విజ్ఞానం నుండి శ్యాంబాబు యుపిఎస్ ఆనేపురం, రమేష్ యుపిఎస్ పురుషోత్తమాయ గూడెం ఎంపికయ్యారని, వీరంతా రేపు 26-08-25 మహబూబాబాద్ అనంతారం మోడల్ స్కూల్ లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. ఈ మేళాలో మరిపెడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరాములు , సి ఆర్ పి రమేష్, జానకిరాములు, బంగారు, శ్రీను, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.