25-08-2025 07:24:56 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి 52వ జన్మదిన సందర్భంగా సోమవారం నల్లగొండ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే నాయకులు అభిమానులు కార్యకర్తలు వివిధవర్గాల సంఘాల నాయకులు కంచర్లను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
10 గంటలకు తమ స్వగ్రామం ఉరుమడ్లలోని కార్యకర్తలు.. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలు వార్డులలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీ గ్రామాలలో కంచర్ల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ గజమాలను క్రేను సహాయంతో స్వామి వివేకానంద విగ్రహం వద్ద కంచర్లకుముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు అలంకరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ చైర్మన్లు మాజీ శాసనసభ్యులు ప్రారంభించారు. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య మాజీ మంత్రి గుంటగండ్ల జగదీశ్ రెడ్డి కేక్ కట్ చేసి కంచర్లకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.