calender_icon.png 3 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి టెట్

03-01-2026 12:33:12 AM

  1. హాజరుకానున్న 2.37 లక్షల మంది అభ్యర్థులు
  2. వీరిలో 71 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు

హైదరాబాద్, జనవరి2 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) శనివారం నుంచి ప్రారంభంకానున్నది. మొత్త 2,37,7 54 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. 9 రోజులు 15 సెషన్‌లలో మొ త్తం 18 జిల్లాల్లోని 97 పరీక్షా కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారు. పేపర్ 85, 538 మంది, పేపర్ 1,52,216 మంది దరఖాస్తు చేసుకోగా, మొత్తం 2,37,754 మంది హాజరుకానున్నారు. రంగారెడ్డి, మే డ్చల్, హైదరాబాద్ పరిధిలోనే 49 కేంద్రా ల్లో 1.60లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 3, 4 తేదీల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు జరగనున్నాయి.

తొలి రోజు ఉదయం సెషన్‌లో 17,500 మంది, మధ్యా హ్నం సెషన్‌లో 17,500 మంది పరీక్ష రా యనున్నారు. ఉదయం 9 జిల్లాలు, మధ్యా హ్నం ౭ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నడు స్తాయి. ఉదయం 9 నుంచి 11.30 వరకు ఉదయం సెషన్, మ ధ్యా హ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. పరీక్షలు 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20వ తేదీల్లో ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.