calender_icon.png 6 January, 2026 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగకు రూ.1200 కోట్ల పనులను చేపడుతాం

05-01-2026 12:00:39 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, జనవరి 4(విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు ముందే మహబూబ్నగర్ జిల్లాలో రూ.1200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాకు రానున్నారని  మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కో-ఆప్షన్ సభ్యులు అర్షద్ అలి ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, మహబూబ్నగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.680 కోట్లతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీటిని ప్రజలు వినియోగించే  పరిస్థితిలేదని, అందుకే  రూ.220 కోట్ల వ్యయంతో  ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నా మని వెల్లడించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికలల్లో అభ్యర్థి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి మన అభ్యర్థి అనే భావంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ప్రజలు ఓటు వేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లలో  రాని నిధులు మహ బూబ్నగర్ కు  కేవలం రెండు సంవత్సరాల్లో తెచ్చి మహబూబ్నగర్ అభివృద్ధిని వేగవంతం చేసిన విషయాన్ని ప్రజలు గమనిం చాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయని తెలిపారు.   

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని, తాను కూడా మహబూబ్నగర్లో విద్యాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఐఐటి కళాశాలను తీసుకురావడంతో పాటు తరగతులు ప్రారంభించామని, అలా గే పాలమూరు యూనివర్సిటీలో లా  ఇంజనీరింగ్ కళాశాలల తరగతులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు.   అసెంబ్లీలో మహబూబ్నగర్ అంశాలపై మాట్లాడే అవకాశం లభించిందని, ఆ సందర్భంగా తేదీలతో సహా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను తాను ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్య మంత్రి కూడా సభలో బీఆర్‌ఎస్ మోసాలను ప్రజల ముందు ఉంచినట్లు తెలిపారు.

ఎన్నడూ లేనివిధంగా మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మహ్మద్ అలి, ఖాజా పాషా, శేఖర్ ఉమర్, అంజద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.