calender_icon.png 11 October, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ లో కిసాన్ గ్రామీణ మేళా

11-10-2025 02:26:05 PM

సుగుణకర్ రావు బెల్లడి

కరీంనగర్, అక్టోబర్11(విజయక్రాంతి): రైతుల ఆర్థిక స్వావలంబనే  లక్ష్యంగా కిసాన్ జాగరన్, నవనిర్మాణ ఫౌండేషన్ సంయుక్తంగా కరీంనగర్లో డిసెంబర్ 1,2,3 తేదీలలో కిసాన్ గ్రామీణ మేళ నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరన్ అధ్యక్షులు పి సుగుణాకర్ రావు వెల్లడించారు. రైతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం వైపు తీసుకెళ్లడం, అందుకోసం రోబోలు, డ్రోన్ లతోపాటు అత్యాధునిక వ్యవసాయ పనిముట్లను ఈ మేళాలో ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోనే అత్యధిక రైతులు సందర్శించి మేళగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఇప్పటి వరకు రెండు సార్లు నిర్బహించిన మేళా కు మంచి స్పందన వచ్చింది, 3  మేళా ను రెండు మేళా లకు భిన్నంగా నిర్వహించ నున్నామనితెలిపారు.