calender_icon.png 11 October, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్ట పడ్డ వారికి పార్టీ టికెట్లు

11-10-2025 02:33:04 PM

మహిళ కాంగ్రెస్ నిర్ణయం

కొత్తపల్లి, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సత్యప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు  అదేశానుసారం దేశ వ్యాప్తంగా ఓటు చోరీ హస్తాక్షర సేకరణ కార్యక్రమం గ్రామాలలో మరియు పట్టణాలలో చేపట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలని కోరుతూ రాబోవు స్థానిక ఎలక్షన్ లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముసిత స్థానం కల్పించడానికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.అనంతరం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను వాడకూడదని పేపర్ గ్లాస్ బదులుగా గాజు గ్లాస్ లు కాని స్టీల్ గ్లాసులు వాడాలని చెప్పారు.కొన్ని గాజు గ్లాసులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నకు అందజేయడం జరిగినది. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజిత,బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు పద్మ,సుశీల,జిల్లా వైస్ ప్రెసిడెంట్లు హసీనా ,స్వరూప కరీంనగర్ జిల్లా మహిళా మండల పట్టణ అధ్యక్షులు పుష్పలత,పద్మ,స్వప్న,రాజేశ్వరి,రాధ,రజిత,మల్లిక తదితరులు పాల్గొన్నారు.