11-10-2025 02:30:33 PM
మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజును చేసే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి త్వరలో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కొనుగోలు చేయు ఎంఎస్పి పరికరాలను వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్నతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనర్లు, మ్యాచర్లు, తార్పాన్లు, కొనుగోలు కేంద్రాలకు నిర్వాహకులు తీసుకుని వెళ్లాలని సూచించారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వము మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి ఏడాదిలోనే ' రైతు రుణమాఫీ' ఎవరికి బోనస్ పథకాలను అమలు చేసిన ప్రజా ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పేరుతో తమది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్పుకునే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వీకారం చుట్టిన కొత్త పథకం ప్రారంభ సందర్భంగా మార్కెట్ డైరెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ను వీక్షించారు. రైతులకు అండగా ఉండేందుకు ధాన్య యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూక్య మధు నాయక్, సగ్గం నర్సయ్య, వాసం వెంకన్న, అమృతమల్లు, బానోత్ శ్రీను నాయక్, సిబ్బంది రమేష్, అఖిల్, లింగరాజు, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.