11-10-2025 02:28:54 PM
కరీంనగర్,(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశాల మేరకు బెల్లంపల్లి వెల్లి మధుకర్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. శనివారం సాయంత్రం బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలాధ్యక్షులు యాట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అధికార కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేక యాట మధుకర్ ముదిరాజ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వెంటనే నీల్వాయి వెళ్లి మధుకర్ కుటుంబాన్ని పరామర్శించాలని రామచంద్రరావు ఇచ్చిన ఆదేశాల మేరకు బండి సంజయ్ వేమనపల్లి మండలంలోని మధుకర్ నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతోపాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇవ్వనున్నారు.