calender_icon.png 31 July, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్తమాన ఘటనలతో థాంక్యూ డియర్

31-07-2025 12:33:14 AM

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కృష్ణవంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన & దర్శకత్వంలో పప్పు బాలాజీరెడ్డి నిర్మాతగా ఆగస్టు 1వ తేదీన విడుదల అవుతున్న చిత్రం ‘థాంక్యూ డియర్’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్, ‘త్రంత’ మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ.. ‘సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేలో ఉండబోతుంది.

ఒక మంచి సందేశంతో అందరూ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను ఉండబోతుంది’ అన్నారు. అలాగే నిర్మాత బాలాజీ, హీరో ధనుష్ రఘుముద్రి, హీరోయిన్ రేఖ నిరోషా తోపాటు చిత్ర యూనిట్ మీడియాతో తమ అనుభవాలు వంచుకున్నారు.