calender_icon.png 31 July, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్డమ్‌లోని భావోద్వేగాలు కట్టిపడేస్తాయి

31-07-2025 12:31:38 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. విజ య్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించా రు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సం గీతం అందించారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. రేపు(గురువారం) ‘కింగ్డమ్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృం దం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. బుకింగ్స్‌కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సంతోషంగా ఉం ది.తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే.. మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ ‘కింగ్డమ్’ ఇది.

ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యు ద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోస మో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యం లో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్డమ్’ ప్రపంచంలోకి వెళ్తా రు. థియేటర్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూ తిని ఇస్తుంది’ అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా ను. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది.

ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది’ అన్నారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. ‘కింగ్డమ్’లో మధు అనే కథకు కీలకమైన పాత్ర పోషించాను. డైరెక్టర్ గౌతమ్ గారు తన పాత్రను అద్భుతం గా మలిచారు. విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.