calender_icon.png 12 July, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యం

12-07-2025 01:13:44 AM

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

దేవరకొండ, జూలై 11: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,ఎంపీ రఘువీర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అంబేడ్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి  దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ నివాళులు అర్పించారు. అనంతరం బాలునాయక్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఇప్పటికే చట్టం చేసింది అని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం చేయాలని జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ అని కుల గణన సర్వే చేసుకున్నాం అని,

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా ఎంపెరికల్ డేటా సేకరించింది అని వారు అన్నారు.కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ కి కేబినెట్ కు బీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.