2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

పేదప్రజల సేవే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యం

12-03-2026 12:11 AM

వెల్దండ, మార్చి 11:మారుమూల గ్రామీ ణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సేవ చేయడమే ఐక్యత ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని శంకర్కో న తండాలో ఐక్యత ఫౌండేషన్ నిధులతో ఏ ర్పాటు చేసిన తాగునీటి శుద్ధి జలాల కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రవీందర్ నా యక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పేద ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

అవసరమైతే మరింత సేవ చేయడానికి ఐక్యత ఫౌండేషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ నాయక్, ఉప సర్పంచ్ మల్లీశ్వరి విజయ్, పలుగు తండా సర్పంచ్ రమేష్ నాయక్, కొండల్ యాదవ్, కృష్ణ యాదవ్, గోపాల్ నాయక్, రవి నాయక్, రమేష్, లక్ష్మి, మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.