calender_icon.png 20 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల బకాయిలు, డీఏలు వెంటనే విడుదల చేయాలి

19-12-2025 12:00:00 AM

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 18 : పెన్షనర్ల బకాయిలు, డీఏలు వెంటనే విడుదల చేయాలని పెన్సనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం జిల్లా ఎన్నికలు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. పెన్షనర్లకు నగదురహిత వైద్య చికిత్సను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పెన్సనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాగుల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జైన సత్యం ఆర్థిక కార్యదర్శిగా రామకిష్టయ్య, సహాధ్యక్షుడిగా రాజేశం, ఉపాధ్యక్షులుగా కృపాసాగర్, జానకిరాములు, ప్రేమలత, కార్యదర్శులుగా బాలకృష్ణారెడ్డి, గోపాల్, నిర్వహణ కార్యదర్శులుగా రాజగోపాల్ రావు, రాఘవరెడ్డి, లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ప్రచార కార్యదర్శిగా మల్లయ్య, రాష్ట్ర కౌన్సిలర్లుగా వెంకట రాములు, దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు పెన్షనర్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.