calender_icon.png 20 December, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కుబడిగా పనిచేయొద్దు..

19-12-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట, డిసెంబర్ 18 (విజయక్రాంతి): నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉద్యోగుల అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓపి రిజిస్టర్ రాయడం సరిగ్గా లేనందున అసహనం వ్యక్తం చేశారు. రికార్డు చక్కగా మెయింటెన్ చెయ్యాలని ఏదో మొక్కుబడిగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పిఎచ్ సిలో మైనర్ రి పేర్లు త్వరగా పూర్తి చేయించేలా కాంట్రాక్టర్ తో మాట్లాడాలని మెడికల్ ఆఫీసర్ కు తెలిపారు. పై హెచ్ సీ లో మెడిసిన్, వైద్య పరికరాలు అన్ని ఉండేలా చూసుకోవాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించేలా మెడికల్ ఆఫీసర్, సిబ్బంది పని చెయ్యాలని ఆదేశించారు. అనంతరం నారాయణరావుపేటలో గల ఆయుష్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయుష్ కేం ద్రంలో చేస్తున్న సేవలు గురించి ఆరా తీశారు. ఆయుష్ సేవలు విస్తరించాలని డాక్టర్ కి తెలిపారు.