30-07-2025 01:05:23 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 29 (విజయక్రాంతి) : కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల ద్వారా జ్ఞానం, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీపూర్ మండలం గుడిపేటలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం నూతన భవనాన్ని షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందుతుందన్నారు. ఏ పాఠశాలలో అయినా ఒక ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రమే చదువుకుంటారని, కేంద్రీ య విద్యాలయాలు, నవోదయ పాఠశాలలలో వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ సంస్కృతల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికగా విద్య అభ్యసించడం జరు గుతుందని తెలిపారు.
అనంతరం విద్యాల యం ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, సమన్వయకర్త శ్రీధర్, తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు.
ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్...
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డు లు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఎరువుల దుకాణాల తనిఖీ...
మండల కేంద్రంలోని నర్మద ఫర్టిలైజర్ దుకాణాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కృష్ణలతో కలిసి సందర్శించి స్టాకు నిల్వలు, రిజిస్టర్లు, రసీదు పుస్తకాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు, యూరియా సమృద్ధిగా ఉన్నాయని, రైతులకు విక్రయించే వాటి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయడంతో పాటు తప్పనిసరిగా రసీదు జారీ చేయాలని సూచించారు.
మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి భవన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవననిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.