24-07-2025 12:00:00 AM
ములకలపల్లి జూలై 23 ( విజయ క్రాంతి ):వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలు పాఠశాలల విద్యా సంస్థల బంద్ లో బాగంగా బుధవారం ములకలపల్లి లో నిర్వహించిన బంద్ విజయవంతం అయింది.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ములకలపల్లి పూసుగూడెం, మాదారం, రాజుపేట భగత్ సింగ్ నగర్, జగన్నాధపురం, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సం స్థల్లో సంపూర్ణంగా బంద్ జరిగింది. ములకలపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వి ద్యార్థిని విద్యార్థులు తరగతులు బహిష్కరించి బంద్ లో పాల్గొన్నారు ఈకార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ఎండీ సోహిల్,వంజరాపు సూర్య, కోర్సా ధనుష్, రామ్ చరణ్, నాగచైతన్య,చరణ్,నరాటి అభి, సాయి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సమ్మయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.