calender_icon.png 6 November, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగలాల్ కుంట చెరువు సుందర శోభితం

06-11-2025 01:24:33 AM

ప్రత్యేకంగా అభినందించిన అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5(విజయ క్రాంతి): గచ్చిబౌలి  డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా లో గల రంగలాల్ కుంట చెరువు సుందరికరణలో భాగంగా ప్రముఖ ప్రొడక్ట్  ప్లాట్ ఫామ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ వర్చుసా కార్పొరేషన్, సి ఎస్ ఆర్ ఫండ్స్, జిహెచ్‌ఎంసి , యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ భాగస్వామ్యంతో స్వచ్ఛందంగా చేపట్టిన సుందరికరణ  పనులు పూర్తయిన సందర్భంగా చెరువును కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి,ఉప్పలపాటి శ్రీకాంత్,

టీజీ ఐఐసి జోనల్ కమిషనర్ ఎం. కవిత, బీటెక్ యాడ్స్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ మాధురి దుగ్గిరాలతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.5 ఎకరాల రంగలాల్ కుంట సరస్సు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రంగలాల్ చెరువుకు దశ దిశ మారిందని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.