calender_icon.png 28 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ అదుపు తప్పి యువకుడి మృతి

28-12-2025 12:36:30 AM

మిర్యాలగూడ, డిసెంబర్ 27 విజయక్రాంతి): బైక్ అదుపు తప్పి యువకుడు మృ తి చెందినట్లు మిర్యాలగూడ గ్రామీణ ఎస్‌ఐ లక్ష్మయ్య శనివారం తెలిపారు. నేరేడుచర్ల కి చెందిన రమావత్ రాకేష్ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులైన సాయి శివ, సురే ష్, మనోజ్‌లతో శుక్రవారం రాత్రి బైక్ లపై మిర్యాలగూడకు వచ్చి కృష్ణపట్నం హోటల్‌లో భోజనం చేశారు.

తిరిగి వెళ్లేటప్పుడు సురేష్ స్కూటీపై మనోజ్, సాయి శివలు కూర్చున్నారు. మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ సమీపంలో స్కూటీ అదుపుతప్పి ముగ్గురు రోడ్డుపై పడిపోగా, మనోజ్ (26) తలకు, చేతులకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మనోజ్ తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర లక్ష్మయ్య పేర్కొన్నారు.