28-12-2025 12:39:40 AM
ఈఎంటీ, పైలెట్ ను అభినందించిన గ్రామస్తులు
పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా వద్ద ఘటన
పుల్కల్(సంగారెడ్డి), డిసెంబర్ 27(విజయక్రాంతి) : దారిలో నీరు నిలిచి ఉండ డంతో అంబులెన్స్ వెళ్లలేక పోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఈఎంటీ, పైలట్ స్ట్రక్చర్‌పై మోసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో చోటుచేసుకుంది. బొమ్మారెడ్డి గూడెం తండాలో నివసిస్తున్న అనూష పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో ౧౦౮కి సమాచారం ఇచ్చారు.
తండాకు వెళ్లే దారికి అడ్డంగా నీరు ఉండడంతో 108 వాహనం మార్గమధ్యలో నిలిచిపోయింది. దీంతో 108 వాహనంలోని ఈఎంఓ, పైలెట్ ఇద్దరు కూడా స్ట్రక్చర్ తో నీరు దాటి ఆ మహిళను తీసుకువచ్చి ఆంబులెన్స్‌లో ప్రాథమిక వైద్యం చేస్తూ సంగా రెడ్డిలోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ సిబ్బంది చేసిన సహాయానికి వైద్య సిబ్బంది అభినందించగా, మహిళ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.