28-12-2025 12:19:34 AM
డిప్యూటీ కమిషనర్ల నియామకం
విలీన మున్సిపాలిటీల కమిషనర్లకే డీసీలుగా బాధ్యతలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి, దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దే క్రమం లో ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. జోనల్ కమిషనర్ల నియామకం పూర్తయిన మరుసటి రోజే.. సర్కిల్ స్థాయి అధికారుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఏకకాలంలో 60 మంది డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
విలీనమైన 27 అర్బన్ లోకల్ బాడీలలో పనిచేసిన ము న్సిపల్ కమిషనర్ల .. తాత్కాలికంగా ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ విభాగంలో జాయింట్ కమిషనర్లుగా ఉన్న పలువురు సీనియర్లను కూడా సర్కిల్ బాధ్యతల్లోకి తీసుకువచ్చారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ పాత స్థానాల నుంచి రిలీవ్ అయి, కొత్తగా కేటాయించిన సర్కిళ్లలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ కర్ణన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.