17-05-2025 01:07:18 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందని, కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆరోపించారు. పార్టీ ప్లీనరీలో హరీష్‌రావుకు ప్రాధాన్యత ఇవ్వకపోడమే అందుకు ఉదాహరణ అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎప్పుడు లేని విధంగా హరీష్‌రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం, రెండు గంటలకు పైగా చర్చలు జరపడం చూస్తుంటే బీఆర్‌ఎస్‌లో చీలిక తప్పదని అర్థమవుతోందన్నారు. హరీష్‌రావు కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరగుతోందని, కవిత కూడా ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా బహటంగానే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసం కేసీఆర్ కుటుంబంలో కొట్టుకుంటున్నారని తెలిపారు. హరీష్‌రావుతో చర్చల మతలబు ఏంటో కేటీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.