calender_icon.png 23 August, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ రాష్ట్ర కమిటీలో మానుకోటకు అగ్రతాంబూలం

23-08-2025 06:48:56 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో మానుకోట వాసులకు అగ్ర తాంబూలం లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మానుకోట పట్టణానికి చెందిన బి.విజయ సారధి రెడ్డి నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి. అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్ నియమితులయ్యారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలలో నూతనంగా ఎన్నికైన మానుకోట పట్టణానికి చెందిన బి.విజయ సారధి రెడ్డి విద్యార్థి సంఘం నుండి అనేక ఉద్యమాలు నిర్వహించి రైతు సంఘం నాయకుడిగా నియోజకవర్గ కార్యదర్శిగా, అనేక ఉద్యమాలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం రైతంగా పోరాటంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు కార్యదర్శిగా ఎంపికయ్యారు.

మానుకోట పట్టణానికి చెందిన బి.అజయ్ సారధి రెడ్డి ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని విద్యార్థి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుడిగా తెలంగాణ ఉద్యమం, మున్సిపాలిటీ ఎన్నికలలో 2014లో పట్టణంలో భారీ మెజార్టీతో గెలిచి, 2020 ఎన్నికల్లో కూడా రెండవసారి వరుసగా పిలవడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని మానుకోట ప్రజాయుద్ధనౌకగా పేరుగాంచడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నల్లు సుధాకర్ రెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉద్యమాలలో పాల్గొని రైతాంగ ఉద్యమం ముఖ్యంగా కొరివి మండల కేంద్రంలో జరిగే ప్రజల కోసం అన్ని ఉద్యోగాలలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆత్మ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరొక కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన కట్టెబోయిన శ్రీనివాస్ అనేక ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో పాల్గొని వైస్ ఎంపీపీగా కూడా ఆ ప్రాంతంలో గెలుపొంది ప్రజా సమస్యల కోసం పోరాటం జరిగింది.