23-08-2025 06:56:56 PM
ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు..
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా సాగాలని ఖానాపూర్ ఎంపీడీవో చిక్యాల రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) అన్నారు. శనివారం ఆయన మండలంలో రంగపేట, కొలంగూడా, పాత ఎల్లాపూర్, దిలావర్ పూర్, గ్రామపంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పర్యవేక్షించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఉత్తర్వులు అందజేసిన మార్క్ ఔట్లు ఇచ్చిన లిస్టు ప్రకారం నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించారు. సందర్భంగా పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను సందర్శించారు. ఆయనతో పాటు ఈ పంచాయతీ ఆపరేటర్ సాగర్, దివ్య, భోజన, దేవేందర్ రెడ్డి, హనుమంతు, మహేష్, తదితరులు ఉన్నారు.